Published On: Fri, Apr 12th, 2019

ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నారు…

* ఈ ఎన్నిక‌ల్లో మా గెలుపు ఖాయ‌మ‌ని న‌మ్ముతున్నాం

* బీజేపీ ఎంపీ అభ్యర్థి కిలారు దిలీప్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నార‌ని, ఓటింగ్ స‌ర‌ళిని చూస్తుంటే ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని  తాము భావిస్తున్నామ‌ని బీజేపీ అభ్య‌ర్థి కిలారు దిలీప్ అన్నారు. శుక్ర‌వారం ఉద‌యం స్టెల్లా క‌ళాశాల స‌మీపంలోని సాయిబాబా గుడి రోడ్డులో ఉన్న త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కిలారు దిలీప్ మాట్లాడుతూ ముందుగా ఓటు హ‌క్కు భారీగా వినియోగించుకున్న ప్రజలకు అభినందనలు తెలిపారు. ఎంతో ఓపికగా, ఎండ తీవ్రత ఎక్కువగా వున్నా, సౌకర్యాలు లేన‌ప్ప‌టికీ అర్ధరాత్రి వరకు కూడా వేచివుండి ఓటు వేయడం హర్షణీయం అన్నారు. ఎన్నికల అధికారులు విధులు సమర్ధంగా నిర్వహించార‌ని ప్ర‌శంసించారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జ‌రిగింద‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో ముఖ్యంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నార‌ని, తాము గెలిచి తీరుతామని నమ్ముతున్నాం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేయాల‌ని ఆకాంక్షించారు. అదే సంద‌ర్భంలో ఎక్క‌డా తాము అవినీతిని సహించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. వీవీ ఫ్యాట్ అనుసంధానం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయ‌ని..  అవి సహజమేన‌న్నారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. లోపాయకారి ఒప్పందాలతో బాబుకే నష్టం జరిగింద‌ని పేర్కొన్నారు. టీడీపీ వ్యతిరేక ఓట్లు తొలగించేశార‌ని ఆరోపించారు. విలేక‌రుల స‌మావేశంలో పార్టీ నాయ‌కులు ఉమామ‌హేశ్వ‌ర‌రాజు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...