* మీడియా హౌస్ ప్రారంభోత్సవంలో శాసనమండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్
సెల్ఐటి న్యూస్,విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం మీడియా సంబంధాలు విస్తరించాయని, రాష్ట్రాభివృధ్ధితో పాటు ప్రతిఒక్కరికీ మేలు జరిగేలా సమాజహితాన్ని ఆకాంక్షించే విధంగా మీడియా రంగం ప్రజలకు మరింత చేరువ కావాలని శాసనమండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా హౌస్‌ను శాసనమండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ గురువారం సాయంత్రం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఎం.ఎ.షరీఫ్ మాట్లాడుతూ శాసనమండలి ఛైర్మన్‌గా తాను బాధ్యతలు స్వీకరించడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అన్నారు. తనకు ఇంత గొప్ప బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరిపూర్ణమైన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సమాజ సేవ, సమాజ దృక్పధాన్ని మీడియా మరింతగా పెంపొందే విధంగా కృషి చేయాలని కోరారు. మీడియాతో పాటు సోషల్ మీడియా దూసుకుపోతున్నప్పటికీ వాస్తవాలను ప్రజలకు చేరువ చేసేది మీడియా మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కేటాయింపులు అర్హులైన వారికి అందేలా మీడియా కృషి చేయాలని సూచించారు. ప్రజాసమస్యలకు పరిష్కార వేదికగా మీడియా హౌస్ నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ప్రభుత్వ సహకారం కూడా మీడియా హౌస్‌కు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మీడియా హౌస్ ఛైర్మన్ పఠాన్ హుస్సెన్ ఖాన్, డైరెక్టర్ అబ్ధుల్ అలీం, వైసీపీ నేత మెహబూబ్ షేక్, ఇందాద్ఘర్ కార్యదర్శి ఫిరోజ్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సెల్ఐటి న్యూస్, అమరావతి: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా Read more →
సెల్ఐటి న్యూస్, బిజినెస్ డెస్క్: విజయవాడలో అతిపెద్ద టైల్స్ శానిటరి షోరూం నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం యజమాని ఎండి Read more →