Published On: Tue, Jun 25th, 2019

ప్ర‌తి గిరిజ‌నుడికి ప్ర‌భుత్వ ఫ‌లాలు అందేలా స్ప‌ష్ట‌మైన కార్య‌చ‌ర‌ణ‌

* గిరిజ‌న సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్‌కుమార్ మీనా

* గిరిజ‌నులు ప్ర‌భుత్వం నుండి ఏమి అశిస్తున్నార‌న్న‌దే కీల‌కం

* గిరిజ‌న జిల్లాల ఏర్పాటు విష‌యంలో పూర్తి స్ధాయి అధ్య‌య‌నం

* తండాలు పంచాయితీలుగా మార్చే అంశంపై శాఖ‌ల స‌మ‌న్వ‌యం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప్ర‌భుత్వ ప్రాధ‌న్య‌త‌ల మేర‌కు విభిన్న ప‌ధ‌కాల అమ‌లు కోసం విస్ప‌ష్ట‌మైన డేటాను సిద్దం చేయాల‌ని గిరిజ‌న సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారుల‌ను ఆదేశించారు. గిరిజ‌న సంక్షేమం విష‌యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌ణాళికను అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ని,  త‌ద‌నుగుణంగా ప్ర‌తి ఒక్క గిరిజ‌నుడికి ప్ర‌భుత్వ ఫ‌లాలు అందేలా కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌న్నారు. విజ‌య‌వాడ గిరిజ‌న సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఉన్న‌త స్ధాయి స‌మీక్ష నిర్వ‌హించారు. శాఖ సంచాల‌కులు గంధం చంద్రుడుతో క‌లిసి విభిన్న అంశాల‌పై స‌మీక్ష చేసిన మీనా అయా స్ధాయిల అధికారుల‌కు త‌దునుగుణ  ఆదేశాలు జారీ చేసారు. కార్య‌ద‌ర్శులు, క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సుకు సంబంధించి సోమ‌వారం ముఖ్య‌మంత్రి నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశం మేర‌కు మీనా అధికారుల‌కు దిశా నిర్ధేశం చేసారు. గిరిజ‌నులు ప్ర‌భుత్వం నుండి ఏమి అశిస్తున్నార‌న్న‌ది కీల‌క‌మ‌న్న మీనా, ఆదిశ‌గా స‌మాలోచ‌న చేయాల‌న్నారు. ఇందుకోసం ఐటిడిఎల స్ధాయిలో ప్ర‌త్యేక స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని, త‌దుప‌రి రాష్ట్ర స్ధాయి స‌ద‌స్సును చేప‌డ‌దామ‌న్నారు. ముఖ్య మంత్రి మ్యానిఫెస్టోలో ఉన్న అంశాల‌కే తొలి ప్రాధ‌న్య‌త‌ ఇస్తున్నార‌ని, ప్ర‌తి ఒక్క అధికారి వాటిని ఏలా అమ‌లు చేయాల‌న్న దానిని వారి స్ధాయిలో స‌మీక్షించుకోవాల‌ని సూచించారు. గిరిజ‌నుల‌కు మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందించే క్ర‌మంలో సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సంస్ఘ‌లు ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న కాగా, త‌గిన ప్రాంతాన్ని అన్వేషించాల‌న్నారు. గిరిజ‌నులు ఆరోగ్య భ‌ధ్ర‌త గిరిజ‌న సంక్షేమ శాఖ‌దేన‌ని స్ప‌ష్టం చేసారు. గూడు లేని గిరిజ‌నుడు ఉండ‌రాదని సిఎం స్ప‌ష్ట‌ప‌రిచార‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు వేగంగా చేయాల‌ని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గిరిజ‌న జిల్లా ఏర్పాటుకు సంబంధించి వాస్త‌వ ప‌రిస్ధితుల‌పై ప్ర‌భుత్వానికి నివేదిక సిద్దం చేయాల‌‌న్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా స్ట‌డీ చేయాల‌ని, ఇత‌ర రాష్ట్రాల‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల స్వ‌రూపాన్ని తీరు తెన్నుల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని కోరారు. వాలంటీర్ల ఎంపిక అనేది మైదాన ప్రాంతాల మాదిరి గిరిజ‌న ప్రాంతాల‌లో చేప‌ట్ట‌టం సాధ్యంకాద‌ని, త‌ద‌నుగుణ ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌న్నారు. ప్ర‌తి గిరిజ‌న తండాను పంచాయితీగా మార్చే విష‌యంలో పంచాయితీ రాజ్‌, రెవిన్యూ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగాల‌న్నారు. గిరిజ‌న సంక్షేమ శాఖ సంచాల‌కులు గంధం చంద్రుడు మాట్టాడుతూ మానిఫెస్టో మేర‌కు ప్ర‌తి విష‌యం పైనా స్ప‌ష్ట‌మైన నివేదిక సిద్దం చేయాల‌న్నారు. గిరిజ‌న గురుకులాల‌కు సంబంధించి మ‌రింత మెరుగైన విద్యా బోధ‌నకు మార్గం సుగ‌మం చేయాల‌న్నారు. ఉపాధ్యాయిల కొర‌త‌కు తావివ్వ‌రాద‌ని గురుకులాల కార్య‌ద‌ర్శి భానుప్ర‌సాద్‌కు అదేశించారు. గిరిజ‌నుల‌కు సంబంధించిన ప్ర‌భుత్వ ప‌ధ‌కాల‌న్ని ట్రైకార్ నేతృత్వంలో జ‌ర‌గుతున్నందున వారి జ‌నాభాకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంస్ధ ఎండి ర‌వీంద్ర‌బాబుకు సూచించారు. స‌మావేశంలో గిరిజ‌న సంక్షేమ శాఖ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ శేషుకుమార్ త‌దిత‌రుల పాల్గొన్నారు.   

Just In...