Published On: Tue, Feb 4th, 2020

ప్ర‌తి పార్లమెంటు నియోజకవర్గానికో బోధనాసుపత్రి

* ఏపిలో కొత్తగా 7 మెడికల్ కాలేజీలలు, 8 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 1 క్యాన్సర్‌ హాస్పటిల్, 7 నర్సింగ్‌ కాలేజీలు

* ఈ నెల 17 నుంచి మూడో విడత కంటి వెలుగు ప్రారంభం

* ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై సీఎం వైయస్ జగన్ మంగ‌ళ‌వారం సమీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్, అధికారులు హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలన్నారు. ఫ‌లితంగా సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, సరిపడా సీట్లు అందుబాటులోకి వస్తాయన్న సీఎం ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది అని, కొత్త విధానాలపై ఆలోచనలు చేయాలన్నారు. 9 చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని చూచాయగా తెలిపిన అధికారులు, 4–5 ఆస్పత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని సీఎం జ‌గ‌న్‌కు వెల్లడించారు. ప్రతి పార్లమెంటుకూ ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలన్న సీఎం బోధనాసుపత్రులను స్వయంశక్తితో నడిచేలా ఆలోచన చేయాలని సూచించారు. ప్రజారోగ్య రంగంపై ఇదివరకటి ప్రభుత్వాలు ఆలోచన చేయలేద‌ని అందువల్లే నేడు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయ‌న్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందించడానికి కృతనిశ్చయంతో ఉన్నాం అన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికొక బోధానుసుపత్రి ఏర్పాటుచేసి, భవిష్యత్తులోనూ అవి మెరుగ్గా నడిచేలా ఒక ప్రణాళిక తయారుచేయాలని అధికారుల‌కు సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రాల (సబ్‌సెంటర్లు) నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వ‌హించి నాడు– నేడులో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలన్నారు.

నాడు – నాడులో భాగం ఈ కింద వాటిలో పనులు…
1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో నాడు – నేడు కింద అభివృద్ధి పనులు, కొన్నిచోట్ల కొత్త నిర్మాణాలు
11 మెడికల్‌ కాలేజీలు, 6 బోధనాసుపత్రుల్లో నాడు– నేడు కింద పనులు
13 జిల్లా ఆస్పత్రుల్లో కూడా నాడు –నేడు కింద పనులు
కొత్తగా 7 మెడికల్‌కాలేజీలలు, 8 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 1 క్యాన్సర్‌ హాస్పటిల్, 7 నర్సింగ్‌ కాలేజీలు
పార్లమెంటు నియోజకవర్గానికో బోధనాసుపత్రి ఉండేలా చూడాలన్న సీఎం
ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు అవుతాయన్న సీఎం
దీంతో భవిష్యత్తులో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉంటుందన్న సీఎం

రాష్ట్రంలోని సూపర్‌ స్పెషాల్టీ మెడికల్‌ కోర్సులపైనా దృష్టిపెట్టాలన్న సీఎం
రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ సూపర్‌ స్పెషాల్టీ కోర్సుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్న సీఎం
కర్నూలు–కడప–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు– చిత్తూరు
కృష్ణా–గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జోన్లవారీగా సంబంధిత కాలేజీల్లో సూపర్‌స్పెషాల్టీ కోర్సులపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఇంత పెద్దస్థాయిలో ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు ఏర్పాట చేస్తున్నందున ఒకే యూనివర్శిటీ పర్యవేక్షించడం కష్టమవుతుందని, దీనికోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్‌ యూనివర్శిటీలను ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి
వాటి పరిధిలోని మెడికల్‌కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అంశాలపై సమగ్రమైన విధానం ఉండాలన్న సీఎం

ఈ ఏడాది మేనెల నాటికి వైద్య–ఆరోగ్యశాఖలో కావాల్సిన సిబ్బందిని రిక్రూట్‌చేసుకోవాలని సీఎం ఆదేశం
ఆతర్వాత ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని సీఎం ఆదేశం
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ నుంచి డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపి (గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీకి ఆదేశం

మూడో విడత కంటి వెలుగు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం
అవ్వా తాతలకు స్క్రీనింగ్‌
దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశామన్న అధికారులు
జులై వరకూ మూడో విడత కంటి వెలుగు
ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున ఇంకా ఎక్కువ సమయంపట్టే అవకాశం ఉంటుందన్న అధికారులు
స్క్రీనింగ్, లోపాల గుర్తింపు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అన్నీ సమకాలంలో జరుగుతాయన్న అ«ధికారులు

ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని కర్నూలులో ప్రారంభించనున్న సీఎం
అదేరోజు సబ్‌సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, మూడోవిడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం

డయాబెటీస్, హైపర్‌ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీల గుర్తింపునకు త్వరలో విస్తృతంగా పరీక్షలు
ఏప్రిల్‌ 1నుంచి ప్రారంభం, గుర్తించిన వారికి వైద్యం
ఈ వివరాలు ఆరోగ్య కార్డులో పొందుపరచనున్న అధికారులు
మార్చి 15 కల్లా అందరికీ హెల్త్‌కార్డులు

ఫిబ్రవరి 17న అనీమియా ముక్త్‌ భారత్‌
ఐఎఫ్‌ఏ టాబ్లెట్లు, సిరప్‌ పంపిణీ
వారానికి రెండు సార్లు
2.85,94,666 మంది పిల్లలు, యువతీ యువకులు, తల్లులు, గర్భిణులపై దృష్టి

అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్‌లపై సీఎం ఆందోళన
సిజేరియన్‌ లేకుండా సహజ ప్రసవాలను ప్రోత్సహించాలన్న సీఎం
ఆమేరకు వైద్యులకు సూచనలు చేయాలన్న సీఎం
తల్లులకు అవగాహన కల్పించాలన్న సీఎం

సదరం సెంటర్లు 52 నుంచి 167కు పెంపు
వారానికి 8,680 మందికి స్లాట్లు
డిసెంబర్‌ 3 నుంచి ఫిబ్రవరి 3 వరకూ 20,642 మందికి సర్టిఫికెట్ల జారీ

ఆరోగ్యశ్రీ కింద 1.43కోట్ల మందిని నవశకం కింద అర్హులుగా గుర్తించిన అధికారులు, మార్చి 15లోగా కార్డులు
హైదరాబాద్‌లో 72, చెన్నై 23, బెంగుళూరు 35 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు
ఇప్పటివరకూ 3 వేలమంది రోగులకు చికిత్స

రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డులు
వచ్చిన దరఖాస్తుల్లో 67వేల మంది అర్హులుగా తేల్చిన అధికారులు
వారికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ

వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద 46,725 మందికి ఫిబ్రవరి 2 వరకూ రూ.33.14 కోట్లు పంపిణీ
ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అవుతున్న సందర్భంలోనే రోగుల విశ్రాంతి సమయానికి ఇవ్వాల్సిన డబ్బును చేతిలో పెట్టాలన్న సీఎం
మరింత సమర్థవంతంగా కార్యక్రమం చేపట్టాలన్న సీఎం

తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్లపై సీఎం ఆరా
వీరిపై మానవతా దృక్పథం చూపించాలన్న సీఎం
అర్హులు ఎవ్వరూ కూడా మిగిలిపోకూడదన్న సీఎం
ఎవరైనా మిగిలిపోతే వాలంటీర్లను వినియోగించుకుని గుర్తించాలన్న ముఖ్యమంత్రి

ప.గో.లో రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపుపై పైలట్‌ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
అమలు వివరాలను సీఎంకు తెలిపిన అధికారులు

 

Just In...