Published On: Fri, Jun 21st, 2019

ప్ర‌భుత్వ బ‌డుల‌ బ‌లోపేతానికి ప్ర‌ణాళిక..

* విద్యారంగ ప్ర‌ముఖుల‌తో విజ‌య‌వాడ‌లో చ‌ర్చావేదిక

* జాతీయ విద్యా విధానం-2019పై వ‌ర్క్‌షాప్‌లో వ‌క్త‌లు

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్ (విజ‌య‌వాడ‌): ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంతో పాటు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, పౌష్టికాహారం, నిధుల స‌మీక‌ర‌ణ అంశాల‌పై విజ‌య‌వాడ ప‌ట‌మ‌టలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల (జెడ్పీ హైస్కూల్‌)లో శుక్ర‌వారం నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌లో ప‌లువురు విద్యారంగ ప్ర‌ముఖులు పాల్గొని త‌మ విలువైన అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా డీవైఈవో కె.ర‌వికుమార్ మాట్లాడుతూ వ‌ర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశాన్ని వివ‌రించారు. ఆయ‌న మాట్లాడుతూ దేశ భ‌విష్య‌త్తు త‌ర‌గ‌తి గ‌దుల్లోనే నిర్ణ‌యించ‌బ‌డుతుంద‌న్న మేథావుల క‌ల‌లు నిజం చేసేందుకు ప్ర‌భుత్వ విద్యా రంగాన్ని మ‌రింత ప‌టిష్టం చేసేందుకు ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు విద్యారంగ ప్ర‌ముఖులు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య ల‌భించ‌దు అనే అస‌త్య ప్ర‌చారాన్ని తిప్పికొట్టేలా ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఉత్తీర్ణ‌త శాతం పెర‌గ‌డం ఎంతో శుభ‌సూచ‌కమ‌ని పేర్కొన్నారు. ప‌లువురు వ‌క్త‌లు మాట్లాడుతూ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను ఏ విధంగా అందించాలి, మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న కోసం నిధులు ఏ విధంగా స‌మ‌కూర్చాలి. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థకాన్ని మ‌రింత నాణ్య‌త‌గా ఎలా త‌యారుచేయాలి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి స‌ర్వ‌శిక్షా అభియాన్ నుంచి నిధులు ఏ విధంగా ర‌ప్పించాల‌నే దానిపై వ‌క్త‌లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ డైట్ లెక్చ‌ర‌ర్స్‌, ప్ర‌త్యేకంగా ఎంపిక చేసిన ప్ర‌ధానోపాధ్యాయులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...