Published On: Thu, Jul 4th, 2019

ప‌గ‌టి వేళ‌ల్లో తాళాలు వేసిన ఇళ్ల‌ల్లో చోరీల‌కు పాల్ప‌డే నిందితుడు అరెస్టు

* రూ.95 వేల నగదు, 11.16గ్రాముల బంగారం, 200గ్రాముల‌ వెండి స్వాధీనం

సెల్ఐటి న్యూస్ విజ‌య‌వాడ క్రైం: కాళేశ్వరరావుమార్కెట్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. విచారణలో నిందితుడు విజయవాడ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ పగటు ఇళ్ళకు తాళాలను వేసి ఉన్న ఇంళ్ళను పరిశీలించి తాళాలను విరగకొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లోని బంగారం, వెండి, నగదు మురియు ఇతర వస్తువులు చోరీ చేసినట్లు వెల్లడి కావడంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి రూ. 95 వేల నగదు, 11.16 గ్రాముల బరువు బంగారు ఆభరణాలు, 200 గ్రా|| వెండి వస్తువులు, మరియు సెల్ ఫోన్ మొత్తం కలిపి సుమారు రూ.1,50,000/- చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తుపాకుల వెంకటేష్ బాబు(23) పటమట బజార్, దర్సి గ్రామం, ప్రకాశం జిల్లా, పైన పేర్కొన్న నిందితుడు ప్రకాశం జిల్లా నుండి విజయవాడకు వచ్చి హోటల్ నందు క్యాటరింగ్ పనులు చేసి జీవిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి తాను పని చేయగా వచ్చిన సంపాదన తన వ్యలనాలకు సరిపోక తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగతానికి పాల్పడటం జరిగింది. ఈ క్రమంలో నిందితుడు ది. 18.06. 2019న పగటి సమయంలో విజయవాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట, మాకినేని వారి వీధిలో ఒక ఇంటికి వేసిన తాళాలను విరగకొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోని ఉన్న బంగారం, వెండి, నగదు మరియు సెల్ ఫోన్ దొంగిలించడం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా డి.కోటేశ్వరరావు అడ్మిన్ డిసిపి మరియు ప్రకాషరావు సీసీఎస్ ఏసిపి ఆధ్వర్యంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నిందితుడుని గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు అతని వద్ద నుండి సుమారు రూ. 1,50,000/- విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా పాల్గొని నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి విధి నిర్వహణలో ప్రతిభ చూపిన సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు సిహెచ్ పి.కృష్ణంరాజు, సీసీఎస్ ఎస్ఐలు వి.శ్రీనివాసరావు, టూటౌన్ క్రైమ్ ఎస్.ఐ.బి.కృష్ణ మరియు సీసీఎస్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ అభినందించారు.

Just In...