Published On: Mon, Jan 6th, 2020

ప‌ట్ట‌ణాలు, నగరాల్లో అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైయస్ జగన్ సోమ‌వారం సమీక్ష జ‌రిపారు. వివిధ పథకాల కింద అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష చేసిన సీఎం. విశాఖపట్నం సహా కాకినాడ, తిరుపతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత వాటి పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష. విశాఖకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం. పోలవరం నుంచి నేరుగా భూగర్భ పైపులైన్‌ ద్వారా తాగునీటి సరఫరాకు సీఎం ఆదేశం. ఆమేరకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.

వైజాగ్‌ మెట్రో రైల్‌ పై సీఎం సమీక్ష…
విశాఖలో బీచ్‌ వెంబడి ఆర్కేబీచ్‌ నుంచి భీమిలి వరకూ ట్రామ్‌ తరహా ప్రజారవాణా వ్యవస్థపై ఆలోచనలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. వీటిపై డీపీఆర్‌ తయారీకి త్వరలో కన్సల్టెన్సీ నియామకం. విశాఖపట్నంలో సుమారు లక్షా యాభైవేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నామన్న సీఎం.

పట్టణ గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష…
ఇప్పటివరకూ 48,608 హౌసింగ్‌ యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించామని సీఎంకు వివరించిన అధికారులు. వీటి కాంట్రాక్టు విలువ రూ.2,399 కోట్లు అయితే రివర్స్‌ టెండర్‌ ద్వారా రూ.303 కోట్లు మిగిలాయని సీఎంకు వివరించిన అధికారులు. మిగిలిన యూనిట్లకూ త్వరలోనే రివర్స్‌ టెండరింగ్‌ పూర్తిచేస్తామని వెల్ల‌డి. స్పెసిఫికేషన్స్‌ మార్చకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న సీఎం. పట్టణ గృహనిర్మాణంలో డ్రైనేజీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. ఈ ప్లాట్ల నిర్వహణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీల్లానే ఫ్లాట్ల నిర్వహణకోసమూ కమిటీలు ఏర్పాటయ్యేలా చూడాలన్న సీఎం. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష. రాష్ట్రవ్యాప్తంగా 110 మున్సిపాల్టీల్లో 19,769 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వేయడానికి రూ.23,037 కోట్లు ఖర్చు అవుతుందంటూ అంచనాలు వివరించిన అధికారులు. లక్షకుపైబడ్డ జనాభా ఉన్న 34 మున్సిపాల్టీల్లో భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధికోసం రూ.11,181 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వెల్లడించిన అధికారులు. మురుగునీటిని తప్పనిసరిగా శుద్ధిచేసిన తర్వాత బయటకు వదలాలన్న సీఎం. భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనులను దశల వారీగా, ప్రాధాన్యతల ప్రకారం మున్సిపాల్టీల్లో చేపట్టాలన్న సీఎం. జనాభాను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలన్న సీఎం. డీశాలినేషన్‌ చేసిన నీటినే పరిశ్రమలు వాడేట్టుగా చూడాలన్న సీఎం. ల‌లాగే శుద్ధిచేసిన మురుగునీటిని పరిశ్రమలు వాడుకునేలా చూడాలన్న సీఎం. మంచినీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడాలన్న సీఎం దీనిపై అవసరమైతే చట్టం చేయాలన్న సీఎం ఆమేరకు సన్నద్ధం కావాలని అధికారులకు ఆదేశం తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాల్టీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలన్న సీఎం కచ్చితంగా ఫలితాలు చూపించాలన్న సీఎం ఈ మున్సిపాల్టీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలతో రావాలన్న సీఎం డీపీఆర్‌ తయారీ చేయిస్తున్నామన్న అధికారులు. తాడేపల్లి, మంగళగిరిల్లో 10,794 మంది ఇళ్లపట్టాల లబ్ధిదారులను గుర్తించామన్న అధికారులు. మోడల్‌కాలనీ కట్టాలన్న సీఎం. ముంపునకు గురికాకుండా విజయవాడలో రిటైనింగ్‌ వాల్‌ పూర్తిచేయాలన్న సీఎం, వీటి పనులు వీలైనంత వేగంగా చేపట్టాలన్న సీఎం. లంచాలు లేకుండా బిల్డింగ్‌ ప్లాన్స్‌ ఇచ్చే పరిస్థితి ఉండాలని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి. ఏసీబీని వాడండి, మెరుగైన వ్యవస్థను తయారుచేయడానికి అహ్మదాబాద్‌ ఐఐఎంని వినియోగించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం. ఫలితాలు కచ్చితంగా రావాలి. అవినీతికి చోటు లేకుండా బిల్డింగ్‌ ప్లాన్స్‌ ప్రజలకు అందాలన్న సీఎం. అవినీతిలేని వ్యవస్థను తీసుకు వస్తే అధికారులను సన్మానిస్తానన్న సీఎం. కమలాపురం, కుప్పంలను మున్సిపాల్టీలుగా మార్చేందుకు సీఎం అంగీకారం. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశం.

Just In...