Published On: Sat, Oct 24th, 2020

ప‌ట్ట‌ప‌గ‌లు నున్న‌లో దోపిడీ…

* ఇల్లు అద్దెకు కావాల‌ని అడుగుతూ మ‌హిళ మెడ‌లో గొలుసు తెంపుకెళ్లిన అ‌గంత‌కులు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజయవాడ నగర శివారు ప్రాంత‌మైన నున్న గ్రామంలోని వికాస్ కాలేజ్ రోడ్డులో గొలుసు దొంగతనం జ‌రిగింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2గంట‌ల స‌మ‌యంలో పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అద్దెకి ఇల్లు కావాలంటూ అడుగుతూ గృహిణి మెడలో మూడున్నర కాసుల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. సీసీఎస్, క్రైమ్, లా అండ్  ఆర్డర్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకొని బాధితురాలి నుండి వాగ్మూలం తీసుకొని సీసీ కెమారా పుటేజ్‌ను పరిశిలించారు. నిందితుల కోసం ప్ర‌త్యేక పోలీసు బృందాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

 

Just In...