Published On: Sat, Oct 17th, 2020

ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

తిరుచానూరు, సెల్ఐటి న్యూస్‌: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శ‌నివారం ప్రారంభ‌మ‌య్యాయి. ప‌ది రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనం‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంత‌రం రాత్రి ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహించారు.  ఈ నెల 26న ఆల‌యంలో గజ వాహనసేవ నిర్వ‌హిస్తారు. ఉత్స‌వాల కార‌ణంగా 10రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ‌ సేవ‌, ఈ నెల 23న జ‌ర‌గాల్సిన ల‌క్ష్మీపూజ సేవ‌లు రద్ద‌య్యాయి.

Just In...