Published On: Fri, Mar 20th, 2020

ప‌న్ను చెల్లింపుదారులకు వివాద్ సే విశ్వాస్ పథకం సువర్ణావకాశం

* వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎంవో ముఖ్య కార్యదర్శి పీ.కే మిశ్రా

 సెల్ఐటి న్యూస్‌,  అమరావతి: పన్ను చెల్లింపుదారులు తమ వివాదాలను సరళతరమైన రీతిలో పరిష్కరించుకోడానికి వివాద్ సే విశ్వాస్ పథకం సువర్ణావకాశమని ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి పీ.కే మిశ్రా తెలిపారు. పన్ను చెల్లింపుదారులు, పన్ను స్వీకరణదారులకు మధ్య వివాదాల పరిష్కారం కోసం ప్రకటించిన వివాద్ సే విశ్వాస్ పథకంపై న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎస్ లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో పీ.కే మిశ్రా పలు సూచనలు చేశారు.  ఏపీ నుండి నీలంసాహ్ని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పన్ను వివాదాల పరిష్కారానికి వివాద్ సే విశ్వాస్ పథకం పథకం సరైన వేదిక అని పీ.కే మిశ్రా తెలిపారు. వడ్డీ, జరిమానాలు లేకుండా కేవలం పన్ను చెల్లింపుల ద్వారా సంబంధిత వివాదాల పరిష్కారానికి ఇదొక మార్గమన్నారు. ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్’  పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. వివాద్ సే విశ్వాస్ పథకం పరిధిలోకి వచ్చే ఆదాయ పన్ను కేసులు, వర్క్ లో ఉన్న కేసుల విషయంలో కోర్టు లిటిగేషన్ ల వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా వన్ టైం సెటిల్ మెంట్ చేసుకునేలా స్థానిక ఇన్ కం ట్యాక్స్ అధికారులతో మాట్లాడాలని సీఎస్ లకు సూచించారు. ప్రతి ఏడాది పెండింగ్ లోని  పన్ను వివాదాలు భారీగా పెరుగుతుండటం వల్ల వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదన్నారు. అలాగే పన్ను చెల్లింపుదారులు నష్టపోతున్నారన్నారు. శుక్ర‌వారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని వెల్లడించారు. వీసీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.ఎస్‌ రావత్‌, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ కె.ఎల్.భాస్కర్ పాల్గొన్నారు.

c

Just In...