Published On: Sun, Dec 2nd, 2018

ప‌ర్యాట‌కంతో విస్త‌రిస్తున్న భార‌తీయ‌ సంస్కృతి

* ఏపీ ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిలప్రియ‌

* ప్ర‌వాస యువ భార‌తీయ బృందంతో ముఖాముఖి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప‌ర్యాట‌కం అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. భార‌తీయ‌ సంస్కృతీ సంప్ర‌దాయాలు ప్ర‌పంచ వ్యాప్తంగా విస్తృత ఆద‌ర‌ణ పొందుతున్నాయ‌ని ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. యువ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించి, తెలుగు సంప్ర‌దాయాల‌న్ని మ‌రింత‌గా ప్రాచుర్యం పొందేలా ఏపీ టూరిజం కృషి చేస్తోంద‌ని వివ‌రించారు. విజ‌య‌వాడ‌లోని హ‌రిత బెం పార్క్‌లో ప్ర‌వాస భార‌తీయ ప‌ర్యాట‌క బృందంతో మంత్రి అఖిల‌ప్రియ శ‌నివారం ముఖాముఖిలో పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చొర‌వ‌తో న‌వ్యాంధ్ర‌లో టూరిజం కొత్త పుంత‌లు తొక్కుతోంద‌న్నారు. ముఖ్యంగా న‌వ్యాంధ్ర నిర్మాణం, అమ‌రావతిపై సీఎం విజ‌న్, ఇక్క‌డి ప‌ర్యాట‌క ప్ర‌దేశాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం, బౌద్ధారామాల అభివృద్ధితో విదేశీ ప‌ర్యాట‌కుల సంఖ్య పెరుగుతోంద‌ని మంత్రి అఖిలప్రియ వివ‌రించారు.
ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి మా ఆహారం, మా సంస్కృతి, సంప్ర‌దాయాలు మీకెలాంటి అనుభూతిని ఇస్తున్నాయంటూ? ప‌్ర‌వాస భార‌తీయ బృందాన్ని మంత్రి అఖిలప్రియ ప్ర‌శ్నించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏటా నిర్వ‌హిస్తున్న కింద ఈ యువ ప్ర‌వాస భార‌తీయ ప‌ర్యాట‌క బృందం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తోంది. న‌వంబ‌రు 24 నుంచి డిసెంబ‌రు 14 వ‌ర‌కు వీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఫిజి, గ‌యానా, నెద‌ర్ ల్యాండ్, మైన్మార్, సౌతాఫ్రికా, శ్రీలంక‌, సురినామ్, తోబాగా, ట్రినిడాడ్లకు చెందిన ఈ యువ ప‌ర్యాట‌క బృందం అనుభ‌వాల‌ను మంత్రి అఖిల ప్రియ ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు. న‌వ్యాంధ్రలో ప‌ర్యాట‌న త‌మ‌కు మ‌ధురానుభూతిని క‌లిగిస్తోంద‌ని, ముఖ్యంగా ఇక్క‌డి ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను చ‌క్క‌గా అభివృద్ధి  చేస్తున్నార‌ని ప్ర‌తినిధులు మంత్రి అఖిలప్రియ‌ని కొనియాడారు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన విశాఖ బొర్రా గుహ‌లు, అర‌కు అందాలు త‌మ‌నెంతో ఆక‌ర్షించాయ‌ని, అయితే ఇవ‌న్నీ చూడాలంటే త‌మ‌కు స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌న్నారు. ఆంధ్ర భోజ‌నం, ఆహార ప‌దార్ధాలు కూడా న‌చ్చాయ‌ని ప్ర‌తినిధులు మంత్రికి వివ‌రించారు.

Just In...