Published On: Wed, Apr 11th, 2018

ప‌ర్యాట‌క ప‌ర్య‌వేక్ష‌ణ‌కు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌

* ఎపిటిడిసి ఎండి, ఎపిటిఎ సిఇఓ హిమాన్షు శుక్లా 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప‌ర్యాట‌కుల‌కు అందిస్తున్న సేవ‌ల్లో మ‌రింత నాణ్య‌త‌ను పెంపొందించ‌ట‌మే ధ్యేయంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. విజ‌య‌వాడలోని ఎపిటిడిసి ప్ర‌ధాన కార్యాల‌యంలో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌టం ద్వారా ఆధునిక సాంకేతికత సాయంతో త‌న ప‌నితీరును మ‌రింత‌గా మెరుగుప‌రుచుకునేలా కార్యాచ‌ర‌ణ సిద్దం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ 80కి పైగా విభిన్న ర‌కాల యూనిట్ల‌ను క‌లిగి ఉంది. వీటిలో హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, ర‌వాణా కేంద్రాలు, జ‌ల అధారిత ప‌ర్యాట‌క ప్రాంతాలు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప‌ర్యాట‌కులు ఈ కేంద్రాల‌లో ఆహ్లాదాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ ప‌ర్యాట‌కుల అంతిమ ప్ర‌యోజ‌న‌మే ల‌క్ష్యంగా త‌న కేంద్రాల‌లో జ‌రుగుతున్న కార్య‌క‌లాపాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించేలా క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల విస్త్రీర్ణంలో 8 తెర‌ల‌పై ఈ 80యూనిట్ల కార్య‌క‌లాపాల‌ను ఉన్న‌తాధికారులు ప‌రిశీలిస్తారు. ఈ నేప‌ధ్యంలో ఏపీ  ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ ఎండి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అధారిటీ సిఇఓ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఎపిటిడిసి కేంద్రాలు అన్నింటిలోనూ ప‌ది వ‌ర‌కు సిసి కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌టం ద్వారా అక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌తి ప‌నినీ కేంద్ర కార్యాల‌యం నుండి నేరుగా ప‌రిశీలించ‌గ‌లుగుతామ‌న్నారు. ఎప్ప‌టి క‌ప్పుడు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ఆ కేంద్రాల కార్య‌క‌లాపాలు చూడ‌గ‌లుగుతామ‌న్నారు. స్వ‌యంగా ఉన్న‌తాధికారులు ఉద్యోగుల ప‌నితీరును  ప‌రిశీలించటం వ‌ల్ల వారి ప్ర‌వ‌ర్త‌న‌లో గుణాత్మ‌క మార్పు సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప‌ర్యాట‌కుల‌తో స్నేహ సంబంధాలు నిర్వ‌హించ‌టంలో ఎటువంటి ఏమ‌రుపాటు ఉన్నా ఇట్టే ప‌సిగ‌ట్ట‌గ‌లుగుతామ‌ని, లోపాలు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకునే వీలు ఉంటుంద‌ని శుక్లా వివ‌రించారు. ఈ క్ర‌మంలో ప‌ర్యాట‌కుల నుండి అక్క‌డి సేవ‌లు, ప్ర‌త్యేకించి ఆహారం, రూమ్‌ల నిర్వ‌హ‌ణ‌పై వారు ప‌ర్యాట‌క ప్రాంగ‌ణం విడిచే స‌మ‌యంలోనే వారి అభిప్రాయాల‌ను తీసుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు. అదాయ వ్య‌యాల‌కు సంబంధించి కూడా సిబ్బందిలో జ‌వాబుదారిత‌నం పెరుగుతుంద‌ని ఇది సంస్ధ‌ను మ‌రింత‌గా లాభాల బాట‌లో ప‌య‌నింప చేయ‌గ‌లుగుతుంద‌ని హిమాన్షు శుక్లా అన్నారు. ఇప్ప‌టికే క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు సంబంధించి ప‌నులు ప్రారంభం అయ్యాయ‌న్నారు. రానున్న నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇది అందుబాటులోకి రానుంద‌ని, కేవ‌లం అయా యూనిట్ల నుండి స‌మాచారం తీసుకోవ‌ట‌మే కాకుండా వీడియో కాన్ప‌రెన్స్ ద్వారా వారు చేసే త‌ప్పోప్పులను ఎత్తి చూప‌గ‌లుగుతామ‌ని వెల్ల‌డించారు.

Just In...