Published On: Wed, Aug 9th, 2017

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌..

* సీడ్‌బాల్స్‌తో ప్ర‌కృతి సోయ‌గాలు

* వ‌నం- మ‌నం కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ సీపీ గౌతం స‌వాంగ్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఆధునిక ప్ర‌పంచంలో వృక్ష జాతి ఆవ‌శ్య‌క‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాల‌పై ప్ర‌జ‌లు అవ‌గాహ‌న పెంపొందించుకుని ప్రకృతిని కాపాడాల‌ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ డి.గౌతం స‌వాంగ్ అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన వ‌నం-మ‌నం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆగ‌స్టు 5న (శ‌నివారం) ఇబ్ర‌హీంప‌ట్నం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కేత‌న‌కొండ సీబీఆర్ అకాడెమీలో క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన సీడ్‌బాల్స్ త‌యారీ ప్ర‌క్రియ వాటి ఉప‌యోగాల‌ను సీపీ గౌతం స‌వాంగ్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కృతి ప్రేమికుడు, క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ సొసైటీ అధ్య‌క్షులు కొడాలి సుభాష్‌చంద్ర‌బోస్ పాల్గొని సీడ్‌బాల్స్ త‌యారీ ప్ర‌క్రియ గురించి సీపీకి వివ‌రించారు. సీడ్‌బాల్స్ త‌యారీ ప్ర‌క్రియ గురించి సీపీ గౌతం స‌వాంగ్ సైతం ఆస‌క్తిగా తెలుసుకున్నారు. అనంత‌రం గౌతం స‌వాంగ్ మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన వ‌నం-మ‌నం, హ‌రితాంధ్ర‌ప్ర‌దేశ్‌, నీరు-చెట్టు కార్య‌క్ర‌మాల్లో భాగంగా బంక‌మ‌ట్టి, ఇత‌ర సేంద్రీయ ప‌దార్థాల‌ను క‌లిపిన మిశ్ర‌మంతో సైంటిఫిక్‌గా త‌యారుచేసిన సీడ్‌బాల్స్‌ను త‌యారుచేయ‌డం ప‌ట్ల కొడాలి సుభాష్‌చంద్ర‌బోస్‌ను సీపీ అభినందించారు. కొండ ప్రాంతాలు, గుట్టలు, అడ‌వులు, ప్ర‌తికూల‌మైన ప్ర‌దేశాల్లో సీడ్‌బాల్స్‌ను నాటేందుకు అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపారు. మ‌ట్టి, ఇత‌ర సేంద్రీయ ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌డం ఫ‌లితంగా నీరు త‌గిలి త్వ‌రిత‌గ‌తిన మొక్క పెరుగుద‌ల‌తో పాటు ప్ర‌తికూల ప‌రిస్తితుల‌ను సైతం త‌ట్టుకుంటుంద‌న్నారు. ఆధునిక ప్ర‌పంచంలో వృక్ష జాతి ఆవ‌శ్య‌క‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఇటువంటి మంచి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిఒక్క‌రూ భాగస్వాములు అవుతూ ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువ‌త‌, విద్యార్థులు, ట్రైక‌ర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లును భాగ‌స్వాముల‌ను చేస్తూ కొండ ప్రాంతాల్లోని నిర్ధారిత రూట్‌మ్యాప్ ఆధారంగా ఈ సీడ్ బాల్స్‌ను వెద‌జ‌ల్లే ప్ర‌క్రియ త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర పోలీస్ శాఖ త‌ర‌ఫున సిబ్బందితో పాటు వారి కుటుంబ‌స‌భ్యులు కూడా పాల్గొంటార‌ని తెలిపారు. వ‌ర్షాకాలం ముగిసేలోగానే ఈ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టాల‌ని పేర్కొన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తికి చుట్టుప‌క్క‌ల ఒక‌వైపున కృష్ణాన‌ది నీలం రంగు.. మ‌రోవైపున ప‌చ్చ‌ద‌నం క‌నిపించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా సీబీఆర్ అకాడెమీలో చ‌దువుతున్న విద్యార్థుల‌ను సీపీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించి వారి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

           మొక్క‌ల ప్రేమికుడు, క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ అధ్య‌క్షులు కొడాలి సుభాష్‌చంద్ర‌బోస్ మాట్లాడుతూ బంక‌మ‌ట్టి ఇత‌ర సేంద్రీయ ప‌దార్థాల‌తో త‌యారు చేసిన సీడ్‌బాల్స్ కొండ‌లు, గుట్ల‌ల్లో వెద‌జ‌ల్లేందుకు అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపారు. సీడ్‌బాల్ నుండి మొక్క ప్రారంభ ద‌శ నుండి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ఏ ఆధారం లేక‌పోయినా సుమారు నాలుగైదు నెల‌ల పాటు మొక్క స‌జీవంగానే ఉంటుందని పేర్కొన్నారు. మ‌న రాష్ట్రం నుండే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుండి మేలైన వేప‌, ఉసిరి, గానుగ‌, మారేడు, గంగ‌రావి, వెల‌గ‌, సిమారుబా, కోసియో ఫిస్టులా స్పాతోడియా, బుద్ద‌న‌ట్ త‌దిత‌ర విత్త‌నాల‌ను సేక‌రించి సీడ్‌బాల్స్ త‌యారు చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం సుమారు 1.50 ల‌క్ష‌ల సీడ్‌బాల్స్ త‌యారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ సంయుక్త క‌మీష‌న‌ర్ బి.వి.ర‌మ‌ణ‌కుమార్‌, లా అండ్ ఆర్డ‌ర్ డీసీపీ కాంతిరాణ టాటా, వెస్ట్‌జోన్ ఏసీపీ జి.రామ‌కృష్ణ‌, సిటీ స్పెష‌ల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్‌.ర‌మేష్‌బాబు, సీఐ గుణ‌రామ్‌, ప‌లువురు సీఐలు, ఎస్‌.ఐ.లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

pariyavaram_2_09-08-17 pariyavaram_3_09-08-17 pariyavaram_5_09-08-17 pariyavaram_4_09-08-17 pariyavaram_6_09-08-17 pariyavaram_7_09-08-17 pariyavaram_10_09-08-17 pariyavaram_11_09-08-17 pariyavaram_9_09-08-17 pariyavaram_8_09-08-17 pariyavaram_1_09-08-17

Just In...