Published On: Wed, Mar 20th, 2019

ప‌శ్చిమంలో గెలుపు నాదే.. 22న నామినేష‌న్ వేస్తున్నా

* వైసీపీ పశ్చిమ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగిన త‌న గెలుపు ఖాయ‌మ‌ని వైసీపీ న‌గ‌రాధ్య‌క్షుడు వెలంప‌ల్లి శ్రీనివాస్ ధీమా వ్య‌క్తం చేశారు. బుద‌వారం సాయంత్రం బ్రాహ్మ‌ణ‌వీధిలోని త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ నెల 22న (శుక్ర‌వారం) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చిట్టినగర్ మ‌హాల‌క్ష్మీ అమ్మవారి గుడిలో ప్ర‌త్యేక పూజ‌ల‌నంత‌రం అక్క‌డి నుండి బయల్దేరి సితార సెంట‌ర్‌, విద్యాధ‌ర‌పురం, నాలుగు స్థంబాల సెంట‌ర్‌, కుమ్మ‌రిపాలెం నుంచి మోడ‌ల్ గెస్ట్‌హౌస్ మీదుగా వెళ్లి నామినేషన్ వేస్తున్న‌ట్లు తెలిపారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్ర‌వేశ‌పెట్టిన నవరత్నాలపై ఇప్పటికే ప్రజల్లో మంచి స్పందన వస్తుంద‌ని తెలిపారు. త‌న‌కు ఎన్నిక‌ల్లో సీటును కేటాయించిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, సహకరిస్తున్న కార్పొరేటర్లకు, శ్రేయోభిలాషుల‌కు ఆచ‌న కృతజ్ఞతలు తెలిపారు. నవరత్నాలు పథ‌కాలు సాధ్యం కాదని అవ‌న్ని అమ‌లు చేయాలంటే అమెరికా బ‌డ్జెట్ కూడా చాల‌ద‌ని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటినే అమలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు త‌మ పార్టీపైన‌, పార్టీ నేత‌ల‌పైన అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎవ‌రూ కూడా చంద్ర‌బాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. త‌న నామినేషన్ కార్యక్రమానికి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లివ‌చ్చి త‌న విజ‌యానికి తోడ్ప‌డాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నిక‌ల్లో త‌న‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. విలేక‌రుల స‌మావేశంలో బీసీ నాయ‌కులు బుద్దా నాగేశ్వ‌ర‌రావు, వైసీపీ ఫ్లోర్‌లీడ‌ర్ బండి పుణ్య‌శీల‌, సంధ్యారాణి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...