Published On: Sat, Sep 9th, 2017

ప‌సిడి ధ‌ర దోబూచులాట‌…!

* నిన్న పెరిగింది.. నేడు పడిపోయింది

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ (బిజినెస్ డెస్క్‌):  అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అమాంతం పెరిగిన బంగారం ధర శ‌నివారం  దిగొచ్చింది. పసిడి ధర శుక్ర‌వారం ఒక్కరోజే రూ. 990 పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పదినెలల గరిష్ఠానికి చేరిన పుత్తడి.. శ‌నివారం  దాదాపు అదే స్థాయిలో పడిపోయింది. శనివారం నాటి ట్రేడింగ్‌లో రూ. 820 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.30,530గా ఉంది.  బలహీన అంతర్జాతీయ సంకేతాలతో పాటు స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్‌ పడిపోవడంతో ధర తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఒక్కరోజే ఇంత ఎక్కువగా ధర తగ్గడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. మరోవైపు వెండి మాత్రం శ‌నివారంనాడు స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 42 వేలుగా ఉంది.
golde-market_11-08-17

Just In...