Published On: Mon, Sep 4th, 2017

ఫాతిమా వైద్య కళాశాల విద్యార్ధులకు ముఖ్యమంత్రి భరోసా…

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: యాజమాన్యపు లోపాల వల్ల విద్యా సంవత్సరం నష్టపోయి వీధుల పాలైన కడప జిల్లా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అంశంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని, విద్యార్ధుల భవిష్యత్తును నష్టపోకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కేంద్రంతో సంప్రదించి వైద్య విధాన పరిషత్ నుంచి సానుకూల ఫలితం వచ్చేలా సంప్రదింపులు జరపాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఆదేశించారు.

cm_with_fathima_college_students_1

Just In...