Published On: Tue, May 14th, 2019

‘ఫెడరల్‌ ఫ్రంట్‌ కేసీఆర్‌కు పగటి కలే’

* కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి విమర్శ

సెల్ఐటి న్యూస్‌, వేంపల్లె: ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పగటి కలే అని.. ఆ ఫ్రంట్‌కు రంగు, రుచి, వాసన లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని రేసులో లేనంటూ ఏపీ సీఎం చంద్రబాబు ముందు నుంచే స్పష్టం చేస్తున్నారని తెలిపారు. యూపీఏ కూటమిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ నెల 16న కడప జిల్లాలో పర్యటిస్తారని, ఆ రోజు కేంద్ర మాజీ మంత్రి  సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని తులసిరెడ్డి వెల్లడించారు.

Just In...