Published On: Wed, Oct 16th, 2019

ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో “సాయి”కి రాష్ట్ర స్థాయి ప్రధమ అవార్డు…

సెల్ఐటి న్యూస్‌, గన్నవరం: దసరా పండ‌గను పురస్కరించుకుని ఈ నెల 13న విజ‌య‌వాడ‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామానికి చెందిన ధనియాల గణపతి మణికంఠ నాగసాయికుమార్‌కి ప్రధమ స్థానంలో అవార్డ్ లభించింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చరల్, గవర్నమెంట్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్, ఏపి ఫోటో క్లబ్- 2019 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు, లైటింగ్, కల్చరల్ అనే మూడు విభాగాలలో ఈ పోటీలు జరపగా లైటింగ్ విభాగంలో సాయికి ప్రధమ స్థానం లభించింది. ఈ పోటీలు ఈ నెల13న జర‌గ‌గా 14న న్యాయ నిర్ణేతలు ఫలితాలు వెల్లడించారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్లు ఆశీనులైన హంస వాహన తెప్పోత్సవానికి అలంకరించిన విద్యుత్ దీపాలంకరణకు ఈ బహుమతి లభించింది. ఈ సందర్భంగా అవార్డు విజేత నాగ‌సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగిన వివిధ పోటీలలో అనేక బహుమతులు తాను సాదించినప్పటికీ అనుకున్నంత సంతృపి మాత్రం కలగలేదన్నారు. ఆంద్రప్రదేశ్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ చెంత జరిగిన ఈ పోటీలో తాను తీసిన ఫొటోకు ప్రధమ స్థానం రావడం తాను జీవితంలో ఎన్న‌టికీ మ‌ర్చిపోన‌ని, ఈ అవార్డుతో త‌న బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని పేర్కొంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. తన ఫొటోను ప్రధమ స్థాయికి ఎంపిక చేసిన నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు, తనను మ‌రింత‌గా ప్రోత్సహిస్తున్న పెద్దలు, శ్రేయోభిలాషులు, తోటి మిత్రులకు సాయి ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 

Just In...