Published On: Sat, Feb 27th, 2021

ఫోటో జ‌ర్న‌లిస్టు సాయికి రాష్ట్ర స్థాయి మదర్‌థెరిసా సేవా పురస్కారం

* అభినందించిన పాత్రికేయులు, ఫొటొ జ‌ర్న‌లిస్టులు

గన్నవరం(విజ‌య‌వాడ‌), సెల్ఐటి న్యూస్‌: కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామానికి చెందిన డి.జి.ఎం.ఎన్.సాయికుమార్‌కి ఆచర్విత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మద‌ర్‌థెరిసా రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం లభించింది. ఈ అవార్డును ఆయన ఈ నెల 24న జిల్లా కేంద్రమైన నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు. ఐఆర్‌ఎస్ కస్టమ్స్ అసిస్టెంట్ అండ్ ఎస్సైజ్ కమిషనర్ డా.సి.హెచ్.ఉషాకిరణ్, నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు అధికారి కె.తిరుపాల్ రెడ్డి, హైదారాబాద్ విశ్రాంత పోలీస్ సూపరింటెండెంట్ డా.కాకుమాను రాజశిఖామణి, నెల్లూరు జిల్లా పాస్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డా.డేవిడ్ దయాసాగర్, జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిన్ను గంగాధరెడ్డి, చెన్నై గ్లోబల్ ఇన్ఫ‌ర్‌మేషన్ సెంటర్ అధికారి ఎస్.వి.రమేష్, హెచ్.యు.ఎం. రాష్ట్ర అధ్యక్షురాలు సయ్యద్ సమీ హుస్సేన్‌, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ వై.సి.పి మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ, విశ్రాంత మండల విద్యా శాఖాధికారి గుంటుపల్లి మాలకొండయ్య, జంగం రమణయ్య తదితరుల చేతుల మీదుగా సాయి పుర‌‌స్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ తనను రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసిన ఆచర్విత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వి.డి.కృపాల్, కమిటీ సభ్యుల‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆచర్విత ఫౌండేషన్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎద‌గాని సాయి ఆకాంక్షించారు. సాయి ఫొటో జ‌ర్న‌లిస్టు కావ‌డంతో ఆయ‌న‌కు పుర‌స్కారం ల‌భించిడంతో విజ‌య‌వాడ‌లోని ప‌లువురు పాత్రికేయులు, ఫొటో జ‌ర్న‌లిస్టులు అభినంద‌న‌లు తెలిపారు.

Just In...