Published On: Thu, Jan 3rd, 2019

ఫోన్‌లో మ‌హిళ‌కు వేధింపులు.. యువ‌కుడికి దేహ‌శుద్ధి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజయవాడకు చెందిన మహిళను కొద్ధి నెలలుగా ఫోన్లో వేధిస్తున్న తెలంగాణ యువకుడిని ప‌థ‌కం ప్ర‌కారం విజ‌య‌వాడ‌కు ర‌ప్పించి దేహ‌శుద్ధి చేసిన ఘ‌ట‌న విజ‌య‌వాడ కోర్ట్ వ‌ద్ద గురువారం జ‌రిగింది. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ మ‌హిళ వాట్సాప్ డీపీని తెలంగాణ‌కు చెందిన యువ‌కుడు రకరకాలుగా డిజైన్లు చేసి పోస్టింగులు పెడుతున్నాడు. అదేవిధంగా ఇద్దరం కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని ఫోన్లు చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆ మ‌హిళ తెలంగాణ నుంచి విజయవాడకు ఆ యువకుడ్ని ప‌థ‌కం ప్ర‌కారం రప్పించింది. కోర్ట్ వద్దకు రాగానే అతడిని పట్టుకుని కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి దేహాశుద్ది చేసింది. అనంత‌రం యువ‌కుడిని సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...