Published On: Mon, Dec 3rd, 2018

ఫ‌లాలు ఆరోగ్యానికి సంజీవిని

* ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే గ‌ద్దె దంప‌తులు  

* నగరంలో ప్యుర్ ఓ నాచురల్ తొలి అవుట్ లెట్‌ను ప్రారంభించిన ప్రముఖులు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: న‌గ‌రంలోని గురునానక్ కాలనీ ప్రధాన రోడ్డులో నూత‌నంగా ఏర్పాటు చేసిన ప్యుర్ ఓ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రాష్ట్ర మొదటి అవుట్ లెట్‌ను ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబుతో పాటు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి గద్దె అనూరాధ ఆదివారం ఉద‌యం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవినిగా పని చేస్తామ‌న్నారు. ఉల్లాసంగా నాజూగ్గా ఉండడానికి వివిధ రకాల ఫలాలు, ఆకుకూరలు తీసుకోవడం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎంతో అవసరమని పేర్కొన్నారు. న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో భాగ‌మైన విజ‌య‌వాడ మ‌హాన‌గ‌రం రోజురోజుకు విస్త‌రిస్తుంద‌ని ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా అన్ని వ్యాపార సంస్థ‌లు ఇక్క‌డ కొలువుదీరుతున్నాయని, త‌ద్వారా అందుబాటు ధ‌ర‌ల్లో ఆయా ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని తెలిపారు. జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ గ‌ద్దె అనూరాధ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మ‌ధుర ఫ‌లాలు, కాయ‌గూర‌లు ప్ర‌జ‌ల చెంత‌కే అందుబాటు ధ‌ర‌ల్లో అందిస్తూ అవుట్ లెట్‌ను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల నిర్వాహ‌కుల‌ను అభినందించారు. ప్యుర్ ఓ నాచురల్ అధినేత‌లు కొస‌రాజు మల్లికార్జున ప్రసాద్‌, చెరుకూరి శివ‌రావ్‌, బొర్రా సుధీర్‌లు మాట్లాడుతూ ఆస్ట్రేలియా, వాషింగ్టన్, థాయిలాండ్, యుఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే 25 రకాల విదేశీ, ఆంధ్ర, తెలంగాణ రైతులు పండించిన నాణ్య‌మైన ఆకుకూరలు అందుబాటు ధ‌ర‌ల్లో లభిస్తాయని తెలిపారు. ఈ రంగంలో త‌మ‌కు 15 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉంద‌న్నారు. హైద‌రాబాద్‌లో నాలుగు శాఖ‌లు నేడు దిన‌దిన‌ప్ర‌వ‌ర్థ‌మానంగా అభివృద్ధి చెందుతూ ప్ర‌జల అవ‌స‌రాల‌ను తీరుస్తున్నాయ‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నూత‌న శాఖ‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తొలి రోజున కొనుగోలుదారుల‌తో అవుట్‌లెట్ కిట‌కిట‌లాడింది. కార్పోరేట‌ర్ దేవినేని అప‌ర్ణ‌తో పాటు ప‌లువురు న‌గ‌ర ప్ర‌ముఖులు, వ్యాపారులు విచ్చేసి న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవుట్ లెట్ నిర్వాహ‌కుల‌ను అభినందించారు.
 

Just In...