Published On: Sat, Nov 2nd, 2019

బంగారు, వజ్రాభరణాల విక్రయాలలో అగ్రగామి కీర్తిలాల్స్

* 80వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు

* వజ్రాభరణాలపై కేరట్‌కు రూ.8వేలు తగ్గింపు

* విజ‌య‌వాడ షోరూంలో సింధూరం బ్రైడల్ కలెక్షన్స్ ఆవిష్కరణ

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: బంగారు, వజ్రాభరణాలను అందించడంలో వినియోగదారుల మన్ననలను పొందుతున్న కీర్తిలాల్ జ్యూయలరీ 80 వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటుందని కీర్తిలాల్స్ జ్యూయలరీ బిజినెస్ జనరల్ మేనేజర్ తెలిపారు. మ‌హాత్మా గాంధీ రోడ్డులోని కీర్తిలాల్ జ్యూయలరీ షోరూమ్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిలాల్స్ 80వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని వజ్రాభరణాలపై కేరట్‌కు రూ.8వేల తగ్గింపు ఇస్తున్నామన్నారు. వార్షికోత్సవంలో భాగంగా ప్రతి ఏటా మహిళల కోసం అద్భుతమైన కలెక్షన్సను అందుబాటులోకి తీసుకువచ్చామని ఈ ఏడాది  *సింధూరం* బ్రైడల్ కలెక్షన్స్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ బ్రైడల్ కలెక్షన్ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ఆభరణాలను అందిస్తున్నామన్నారు. వివాహా కార్యక్రమంలో సంగీత్‌కు కావాల్సిన డిజైన్లు, వివాహానికి కావాల్సిన డిజైన్లు , క్లాసికల్ కలక్షన్స్‌ను షోరూమ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో వచ్చే జమికీలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. యువత, మహిళల కోసం ప్రత్యేకంగా గ్లో అండ్ గ్లో డిజైన్‌ను తీసుకువచ్చామన్నారు. ఆభరణాలను వినియోగదారులకు అందిండచంలో అగ్రగామిగా ఉన్న కీర్తిలాల్స్ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో కూడా ముందుందన్నారు. సిఎస్ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) క్రింద ‘ఎవర్ గ్రీన్ ట్రెజర్స్’ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడతో విశాఖపట్నంలో కూడా కీర్తిలాల్స్ షోరూమ్ ఉందని రానున్న కాలంలో మరిన్ని స్టోర్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించనున్నట్లు తెలిపారు. కొయంబత్తూరులో 1939లో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించామని క్రమంగా కీర్తిలాల్ ప్రస్తానం పెరుగుతూ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో 11 నగల దుకాణాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా పేరుప్ర‌ఖ్యాత‌లు గ‌డించామ‌న్నారు. ఈ సందర్భంగా ప్రముఖ మోడల్స్ ప్రీతి, శ్రావణిలచే సింధూరం కలెక్షన్స్ డిజైన్లతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో కీర్తిలాల్స్ మర్కెండైజింగ్ సేల్స్ రిటైల్ హెడ్ ఆర్.రఘునాథ్, సంస్థ ఉపాధ్యక్షుడు ముత్తుకుమార్, స్టోర్ మేనేజర్ రమణసాయి, ప్రతినిధులు శ్రీనివాస్, సెల్వరాజన్ తదితరులు పాల్గొన్నారు.

Just In...