Published On: Tue, Jan 12th, 2021

బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విజ‌య‌వాడ‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు.. దత్తాత్రేయను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీని హిమాచల్‌ప్రదేశ్‌ సంప్రదాయంతో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సత్కరించారు. ఈ సంద‌ర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గమ్మను బండారు దత్తాత్రేయ మంగళవారం ఉద‌యం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.

Just In...