Published On: Fri, Jul 12th, 2019

బడ్జెట్‌లో బుగ్గన ‘రామాయణం’…

* దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారని వ్యాఖ్య‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ అసెంబ్లీలో బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన రామాయణంలోని ఓ ఘట్టాన్ని గుర్తు చేశారు. ఇంద్రజిత్‌ అస్త్రానికి కుప్పకూలిన లక్ష్మణుడిని మూర్ఛ నుంచి లేపేందుకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినట్లు దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారని అన్నారు. ప్రతి పేద కుటుంబం కార్పొరేట్‌ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం పొందే లక్ష్యంతో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తెచ్చారు. ప్రజలు పేదరికంలోకి పడిపోవడానికి వైద్య ఖర్చులు కూడా కారణమని ఆయన భావించారు. ఆ పథకాలను మా ప్రభుత్వంలో మరింత వెలుగులీనేలా చేస్తామని చెబుతున్నాం. ఇందులో భాగంగా ఆరోగ్య శ్రీని ఈ కింది విధంగా విస్తరిస్తున్నాం. వార్షిక ఆదాయం రూ.5లక్షలు లోపు ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వైద్య ఖర్చులు రూ.1000 అంతకు మించిన అన్ని కేసుల చికిత్స వ్యయంపై పరిమితి లేకుండా అందరికీ వైద్యం అందిస్తాం. బెంగళూరు, చెన్నైలలోని ప్రముఖ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు పొందవచ్చు. ఇందుకోసం ఆయా ఆస్పత్రుల జాబితాను చేరుస్తాం. ఇందుకోసం రూ.1,740కోట్లు కేటాయిస్తున్నట్లు బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌క‌టించారు.

Just In...