Published On: Mon, Aug 19th, 2019

బస్టాండ్ ఆధూనికీకరణతో ప్రజలకు మెరుగైన సేవలు

* మంత్రి కొడాలి నాని

సెల్ఐటి న్యూస్, గుడివాడ, ఆర్టీసీ బస్ స్టాండ్ ను పునర్నించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. స్థానిక యన్టీర్ స్టేడియం కార్యాలయంలో సోమవారం మంత్రి కొడాలి నాని గుడివాడ బస్ స్టాండ్ పుననిర్మాణం ఆర్టీసీ, రవాణా అధికారులతో చర్చించి బస్టాండ్ నిర్మాణానికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజలందరి సౌకర్యవంతంగా ఉండటమే కాక మోడల్ బస్టాండ్ గా నిర్మించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాని మంత్రి కొడాలి నాని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ ఛైర్మన్ లంక దాసరి ప్రసాదరావు, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...