Published On: Tue, Oct 1st, 2019

బాపూజీ ఆదర్శాలే..స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి

* మహాత్మునికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఘన నివాళి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సత్యం, అహింస, శాంతి.. ఈ పదాలకు నిజమైన అర్థం బాపూజీ జీవితం. ఆ మహామహుడి 150వ జయంతి వేళ.. ఆయన స్వప్నమైన గ్రామ స్వరాజ్యాన్ని ‘గ్రామ సచివాలయాల’ ఏర్పాటు ద్వారా నేటి(అక్టోబరు 2) నుంచి సాకారం చేస్తున్నాం. గత 4 నెలల్లోనే 43,000 బెల్ట్‌ షాపుల్ని మూసివేసి, మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 3,500కు తగ్గించాం. భారతీయ ఆత్మ మన పల్లెల్లోనే ఉందన్న గాంధీజీ పలుకులే వేదాలుగా రైతులు, పేదల సంక్షేమానికి, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేస్తున్నాం. ‘నా జీవితమే నేనిచ్చే సందేశం’ అని చాటిన ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఖండాలూ, దేశాలు అవతల కూడా మహానాయకులు, మామూలు మనుషులు ఎప్పటకీ స్మరించుకుంటారు. మొత్తంగా ప్రపంచ మానవాళి మీద చెరగని ముద్ర గాంధీ..!

Just In...