Published On: Mon, Apr 5th, 2021

బాబూ జగ్జీవన్‌కు సీఎం జగన్‌ నివాళి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: దివంగ‌త ఉప ప్ర‌ధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమ‌వారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు విశ్వరూప్, అదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ సేవలను సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. ‘స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Just In...