Published On: Mon, Apr 5th, 2021

బాబూ జగ్జీవన్‌ రామ్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది, భార‌త‌దేశ మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జగ్జీవన్‌ రామ్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా న‌గర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పాల్గొని జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రాం సమతావాదం, సంఘ సంస్కరణలు, త్యాగాలు మరియు వివిధ శాఖల మంత్రి హోదాల్లో ఆయన ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి డి.మేరీ ప్రశాంతి, సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏసిపిలు ఎల్.అంకయ్య, సి.హెచ్.రవికాంత్, ఏఆర్ ఏసిపి ఏ.చెంచురెడ్డి, ఏ.ఓ. టి.రంగారావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళి అర్పించారు.

Just In...