Published On: Mon, Apr 6th, 2020

బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జీవితం భావిత‌రాల‌కు ఆద‌ర్శం

* కృష్ణా క‌లెక్ట‌ర్ ఎ.యండి.ఇంతియాజ్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన డాక్ట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకo అని కృష్ణాజిల్లా క‌లెక్ట‌ర్ ఎ.యండి.ఇంతియాజ్ అన్నారు. డా.బాబూ జగ్జీవన్‌రామ్ 113వ జయంతి సందర్భంగా ఆదివారం ఉద‌యం ఆయన చిత్రపటానికి త‌మ కార్యాల‌యంలో జిల్లా కలెక్టర్ ఎ.యండి.ఇంతియాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ మాట్లాడుతూ డా.బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం భావితరాలకు ఆదర్శప్రాయం అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్‌రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిద‌ని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకo అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, వైద్యాధికారి శర్మిష్ట తదితరులు పాల్గొన్నారు.

Just In...