Published On: Mon, Apr 6th, 2020

బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ బాట‌లో ప‌య‌నిద్దాం…

* వైసీపీ 21వ డివిజ‌న్ అభ్య‌ర్థిని పుప్పాల కుమారి

గుణ‌ద‌ల‌(విజ‌య‌వాడ‌), సెల్ఐటి న్యూస్‌: భారత తొలి ఉప ప్రధాని నవ సమాజ స్థాపనకు కృషిచేసిన కృషీవలుడు బాబూ జగ్జీవ‌న్‌రామ్ ఆశ‌యాల‌ను సాధించే దిశ‌గా యువ‌త ఆయ‌న బాట‌లో ప‌య‌నించాల‌ని 21వ డివిజన్ కృష్ణ లంక వైసీపీ అభ్యర్థిని పుప్పాల కుమారి అన్నారు. జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి సంద‌ర్భంగా న‌గ‌రంలోని జింఖానా గ్రౌండ్స్ వ‌ద్ద ఉన్న బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ విగ్ర‌హానికి ఆమె పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా పుప్పాల కుమారి మాట్లాడుతూ 50 సంవత్సరాలు ఎంపీగా, 33 సంవత్సరాలు కేంద్రమంత్రిగా సేవలందించి దళితులందరికీ ఆరాధ్య దైవంగా ప్రపంచంలోనే మెటి స్పీకర్‌గా సేవలందించిన బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్‌ను ఆయన కుమార్తె మీరాకుమార్‌ను ఆదర్శంగా తీసుకొని ఐక్యంగా ఉండి దళితుల అభ్యున్నతికి కృషి చేయాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు మేడా రమేష్, న‌గ‌ర ఎస్సీ సెల్ నాయకులు రమేష్, రాజేష్, రేపాల నాగెశ్వరావు, సుంకర పెద్దబ్బాయి, పంతాల సాయిబాబు, గోగు గౌరి తదితరులు పాల్గొన్నారు.

Just In...