Published On: Fri, Feb 8th, 2019

బాయిల‌ర్స్ ఆప‌రేట‌ర్ల ఉద్యోగుల‌కు ధృవ‌ప‌త్రాలు ప్ర‌దానం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: వెలగపూడి సచివాలయంలోని కార్మికశాఖ మంత్రి కార్యాలయంలో బాయిలర్స్ శాఖాధికారులతో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పస్టు క్లాస్, సెకండ్ క్లాస్ బాయిలర్స్ ఆపరేటర్లుగా ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి మంత్రి చేతుల మీదుగా ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. వివిధ పరిశ్రమల నుండి వచ్చిన వారికి శిక్షణ తరగతులు, రాత పరీక్షలు నిర్వహించి సామార్ధ్యం గల ఆపరేటర్స్‌ను ఎంపికచేయటం జరిగిందని అందులో భాగంగా మొత్తం ఫస్ట్ క్లాస్ బాయిలర్ నుండి 15 మంది, సెకండ్ క్లాస్ బాయిలర్ నుండి 30 మంది బాయిలర్ ఆపరేటర్స్‌ను ఎంపికచేసి వారికి ధ్రువపత్రాలు ప్రదానం చేశామని మంత్రి పితాని తెలిపారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ బాయిలర్స్ శాఖ ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేయడంలో ప్రభుత్వం  నిరంతరం కృషి చేస్తుందని, బాయిలర్స్ సర్టిఫికేషన్ చేసినవారికి నూతన పరిశ్రమలలో మైరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వాటిని సధ్వినియోగం చేసుకోవాలని బాయిలర్స్ ఆపరేటర్స్‌ మంత్రి సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉమా మహేశ్వర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...