Published On: Sat, Oct 17th, 2020

బాలా త్రిపుర సుంద‌రీదేవి…

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్: శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండో రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ విదియ ఆదివారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి.
అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.

Just In...