Published On: Sat, Feb 2nd, 2019

బాలిక కుటుంబానికి అండ‌గా ఉంటాం

* ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ కోడెల‌

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: ఇటీవ‌ల మాచ‌ర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలో లైంగికదాడికి గురై గుంటూరు జనరల్ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని ఏపీ శాస‌న‌స‌భ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల‌ను ఆదేశించారు. అనంత‌రం స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ ఇటీవల తుమ్మలకోటలో అత్యాచారానికి గురైన బాలికను చూడడం జరిగింది. చాలా హృదయ విదారమైన ఘటన. అలాంటి వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవాలి. బాలిక కుటుంబం ఆ ఊరు వెళడానికి ఇష్టపడడం లేదు. ముఖ్య‌మంత్రితో మాట్లాడి వారికి పూర్తిగా అండగా ఉంటామ‌న్నారు.
 

Just In...