Published On: Mon, Feb 22nd, 2021

బిజేపి‌ నుంచి వైసీపీలోకి చేరిక‌లు

* అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

* దేవా‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: వైసిపి అభ్య‌ర్థుల‌ను గెలిపిoచాలని నిర్వ‌హించే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నార‌ని మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు అన్నారు. జ‌గన్మోహ‌న్‌రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంతోషాంగా ఉన్నార‌ని తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సొమ‌వారం 46వ డివిజ‌న్ అభ్య‌ర్థి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి(న‌రేంద్ర‌) తదిత‌రుల‌తో క‌లిసి కలరా హాస్పిటల్ వద్ద నుంచి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప్రజలను స్వయంగా కలిసి కొండ ప్రాంత సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మ‌హిళలు, స్థానిక మైనార్టీ నాయ‌కులు మంత్రికి పూలతో స్వాగ‌తం ప‌లికారు. వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో బిజేపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ న‌గ‌రాధ్యక్షుడు కొత్తమాసు వెంక‌ట పిచ్చయ్య, ఆయ‌న అభిమానులు మంత్రి వెలంపల్లి సమక్షంలో సోమ‌వారం వైసీపీలో చేరారు. ఉదయం  బ్రాహ్మాణ వీధిలోని మంత్రి కార్యాలయంలో 39 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ రాఘ‌వా న‌రేంద్ర‌ ఆధ్వర్యంలో బిజేపి‌ నాయ‌కులు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. వారందరికీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Just In...