Published On: Mon, Jun 24th, 2019

బీజేపీలో చేరిన టీడీపీ నేత అంబికా కృష్ణ

* ఢిల్లీలో రాంమాధవ్ సమక్షంలో పార్టీలో చేరిక

* అంబికాను అభినందించిన బీజేపీ నేతలు

సెల్ఐటి న్యూస్‌, ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో సోమ‌వారం సాయంత్రం ఆయ‌న కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో చేరిన ఆయనను రాంమాధవ్ సహా పలువురు నేతలు అభినందించారు. కాగా, మొన్నటివరకు ఏపీఎఫ్డీసీ చైర్మన్‌గా అంబికా కృష్ణ ఉన్నారు. ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా సాగుతోంది. త్వరలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నట్టు సమాచారం.

Just In...