Published On: Sat, Oct 24th, 2020

బెజవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

* రూ.7.50 లక్షలు న‌గ‌దు, 20 మొబైల్ కనెక్షన్ కలిగిన కమ్యూనికేటర్

బాక్స్, ల్యాప్‌టాప్, సెల్ఐటి న్యూస్‌: 13 సెల్‌ఫోన్స్ స్వాధీనం విజయవాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను శ‌నివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరంతా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. పెనమలూరు పీఎస్ మురళినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని క్రికెట్ మజా యాప్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంద‌ర్భంగా వారి నుంచి రూ.7.50 లక్షలు న‌గ‌దు, 20 మొబైల్ కనెక్షన్ కలిగిన కమ్యూనికేటర్ బాక్స్, ల్యాప్‌టాప్, 13 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

Just In...