Published On: Thu, Nov 7th, 2019

బోటు ప్ర‌మాదాల నివార‌ణ‌ఛ భ‌ద్ర‌త‌కు 8 కంట్రోల్ రూంలు ఏర్పాటు

* బోట్ల‌లో లిక్క‌ర్ వినియోగానికి ఇక‌పై చెక్‌

* స‌మీక్ష‌లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయస్ జగన్ బుధ‌వారం సమీక్ష నిర్వ‌హించారు. జలవనరులు, టూరిజం, ఇతర శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అధికారులు పాల్గొని బోటు ప్రమాద ఘటన, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎంకు వివరించారు. బోటు ప్రమాదాల నివారణ, భద్రత కోసం 8 చోట్ల కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుకు సీఎం నిర్ణయం. ఎమ్మార్వో ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్స్‌. కంట్రోల్‌ రూంలో జలవనరుల శాఖ, పోలీసులు, టూరిజం తదితర విభాగాల నుంచి సిబ్బంది. ప్రతి కంట్రోల్‌ రూంలో కనీసం 13 మంది సిబ్బంది. ప్రతి కంట్రోల్‌ రూంలో ముగ్గురు పోలీస్‌కానిస్టేబుళ్లు తప్పనిసరి. నవంబర్‌ 21న 8 కంట్రోల్‌ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన. 90 రోజుల్లో అందుబాటులోకి కంట్రోల్‌ రూమ్స్‌. బోట్లు ప్రయాణించాల్సిన మార్గాలు, వాటి కదిలకపై నిరంతర సమాచారం, వరద ప్రవాహాలపై సమాచారం వీటన్నింటినీ కంట్రోల్‌ రూమ్స్‌ పరిగణలోకి తీసుకుని ఆమేరకు బోట్ల నిర్వహణను పర్యవేక్షించాలి. బోట్లలో ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్‌ వినియోగం ఉండకూడద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. అలాగే సిబ్బందికీ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలి. బోట్లకు జీపీఎస్‌ కూడా పెట్టాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా కంట్రోల్‌ రూమ్స్‌ను తీర్చిదిద్దాలి. కంట్రోల్‌ రూమ్స్‌పరిధిలో బోట్లు, జెట్టీలు ఉండాలి. బోట్లపై ప్రయాణించేవారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్‌ రూమ్స్‌కే ఇవ్వాలి. బోటులో ప్రయాణించుటకు టిక్కెట్లు టూరిజం శాఖకి /సంబంధించిన అధికారులనుంచి నుంచి తీసుకోవాలని నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రిగారికి సూచించారు. కంట్రోల్‌ రూమ్‌కు ఎమ్మార్వోనే ఇన్‌ఛార్జి. ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా కంట్రోల్‌ రూం చూడగలిగితే.. గ్రేడింగ్‌ ప్రకారం వారికి కనీసం 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలి:సీఎం బోట్లలో వాకీటాకీలు, జీపీఎస్‌లు తప్పనిసరిగా ఉండాలి. మరోసారి బోట్లన్నీ తనిఖీచేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలి. ఆపరేటింగ్‌ స్టాండర్ట్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ఉండాలి. నదిలో ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. కంట్రోల్‌రూంలో ఉండే సిబ్బంది నదిలో ప్రయాణాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి. కంట్రోల్‌ రూమ్స్‌లో సిబ్బందిని రిక్రూట్‌ చేశాఖ వారికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వండి. కంట్రోల్‌ రూమ్స్‌లో ఉంచాల్సిన సిబ్బందిని త్వరగా రిక్రూట్‌ చేయాలి. ప్రస్తుతం లైసెన్స్‌లు, బోట్లను తనిఖీ చేస్తున్నామన్న అధికారులు. బోట్లలో పనిచేసేవారికి శిక్షణ కూడా ఇవ్వాలి, శిక్షణ ఉన్నవారికే పనిచేయడానికి అనుమతి. క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసిన తర్వాతనే బోట్లకు అనుమతి ఇస్తామన్న అధికారులు. దీనికోసం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామన్న అధికారులు.

 

Just In...