Published On: Thu, Mar 14th, 2019

బ‌ల‌హీన‌వ‌ర్గాల సంక్షేమానికి కృషి..

* పాద‌యాత్ర‌లో కోరాడ విజ‌య్‌కుమార్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ (భ‌వానీపురం): రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముస్లిం, మైనార్టీల‌తో పాటు బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని, డివిజ‌న్ అభివృద్ధి కోసం ఏమాత్రం వెనుకాడ‌న‌ని కోరాడ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ కోరాడ విజ‌య్‌కుమార్ అన్నారు. బీసీ అభ్య‌ర్థిగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన ఆయ‌న రోజువారీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో 27వ డివిజ‌న్‌లోని స్థానిక యువ‌కులు లియ‌క్ అలీ, సుజిత్‌, వినోద్, షానూర్‌, సంషాద్ ఆధ్వ‌ర్యంలో భ‌వానీపురంలోని హ‌రిజ‌న‌వాడ‌, క‌ర‌క‌ట్ట‌, మ‌సీద్ సెంట‌ర్‌, బ్యాంక్ సెంట‌ర్‌, మీరాసాహెబ్ వీధి, రంగూన్‌సాహెబ్ వీధి, న‌యీబ్ సాహెబ్ వీధి త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఇంటింటికీ తిరుగుతూ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని కోరుతూ ఓట్లు అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా ఇళ్ల‌ప‌ట్టాలు ఇప్పించాల‌ని, త‌మ‌కు ఓటు కార్డులు లేవ‌ని, నివాసాల న‌డుమ ఉన్న క‌మ్యూనిటీ హాల్ ధ్వంస‌మైంద‌ని దాని అభివృద్ధికి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదుని. డ్రైన్లు కార‌ణంగా జీవనం సాగించ‌లేని ప‌రిస్తితి నెల‌కొంద‌ని ఆయా ప్రాంతాల స్థానికులు కోరాడ విజ‌య్‌కుమార్ ఎదుట వాపోయారు. అనంత‌రం కోరాడ విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయా డివిజ‌న్ల‌లో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై పూర్తిస్తాయి అవ‌గాహ‌న ఉంద‌న్నారు. 27వ డివిజ‌న్‌లో ముస్లి, మైనార్టీల‌తో పాటు హ‌రిజ‌నులు ఎక్కువ‌గా నివ‌సిస్తున్నార‌ని, స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ క‌ర‌క‌ట్ట వెంబ‌డి వారు సాగిస్తున్న జీవ‌న విధానం ద‌య‌నీయంగా ఉంద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లు ఎక్కువ‌గా ఉన్నందునే కోరాడ ఫౌండేష‌న్ ద్వారా సామాజిక బాధ్య‌త‌గా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి ప‌ధంలో న‌డిపిస్తాన‌ని పేర్కొన్నారు. పాద‌యాత్ర‌లో నాయ‌కులు బాడిత శంక‌ర్‌, అప్స‌ర్‌, మెండు అశోక్, కోరాడ అభిమానులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...