Published On: Wed, Mar 20th, 2019

బ‌ల‌హీన‌వ‌ర్గాల సంక్షేమానికి కృషి చేస్తా…

* ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెదేపా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిని ష‌బానా ఖాతూన్‌
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ (పాత‌బ‌స్తీ): బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ స్థానికంగా ఆయా డివిజ‌న్‌ల‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌తో పాటు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిని ష‌బానా ఖాతూన్ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం ఉద‌యం ఆమె 41వ డివిజ‌న్‌ ఏలూరులాకుల వ‌ద్ద ఉన్న శ్రీకోదండ‌రామ దాసాంజ‌నేయ‌స్వామి వార్ల దేవ‌స్థానం నుంచి పాద‌యాత్ర‌గా డివిజ‌న్‌లో ప‌ర్య‌టించారు.  డివిజ‌న్‌లోని పూర్ణానందంపేట‌, బాప్టిస్టుపాలెం, కౌతాసుబ్బారావు వీధి, ల‌క్ష్మ‌ణ‌రావు వీధి త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతూ ఓట్లు అభ్య‌ర్థించారు. ఆమెకు మ‌ద్ద‌తుగా కేశినేని శ్వేత పాల్గొని విస్త్ర‌త ప్ర‌చారం నిర్వ‌హించారు. తన‌ను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగేలా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావాలంటే ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ఉంటేనే సాధ్య‌మౌతుంద‌ని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Just In...