Published On: Sat, Sep 12th, 2020

భవానీపురం సీఐగా బాధ్యతలు స్వీకరించిన మురళీకృష్ణ

విజ‌య‌వాడ ‌(భవానీపురం), సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ‌లోని భవానీపురం పోలీస్‌స్టేషన్ సీఐగా జె.మురళీకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఐగా పని చేసిన డి.కె.ఎన్.మోహన్ రెడ్డిని సిటీ స్పెషల్ బ్రాంచ్ సీఐగా నియమించారు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన మురళీకృష్ణ మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

Just In...