Published On: Wed, May 15th, 2019

భాజపా అసలు రంగులు చూపిస్తోంది!

* కోల్‌క‌తాలో దాడుల‌ను ఖండించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

* ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయం అంటూ ట్వీట్‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: కోల్‌కతాలో భాజపా దాడులను ఖండిస్తున్నట్టు తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమన్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో బెంగాల్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు అసలు రంగులు చూపిస్తూ భాజపా ప్రత్యక్ష దాడులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ, అమిత్‌షా చేస్తోన్న విధ్వంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపుతూ అమిత్‌ షా చర్యలను ఖండిస్తున్నట్టు ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు బుధ‌వారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Just In...