Published On: Fri, Feb 19th, 2021

భాజాపాలో చేరిన ముస్లిం మైనార్టీ నాయకులు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: గుంటూరు కు చెందిన ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా శుక్ర‌వారం భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు ‌సోము వీర్రాజు అధ్యక్షతన వారి అనుచరులు 100 మందితో రాష్ట్ర మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు. నాగుల్‌మీరా గత కొంతకాలంగా ముస్లిం హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి హక్కులు కాపాడిన అపార అనుభవం ఉంద‌ని, ఆయ‌న ముస్లిం పేద విద్యార్థులకు ఆర్ధిక భరోసా కల్పించిన వ్యక్తిగా షేక్ బాజీ పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాగుల్‌మీరా మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలోని ముస్లిం కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడతామన్నారు. భారతదేశంలో ముస్లింగా పుట్టినందుకు గర్వపడుతున్నామ‌ని, మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ముస్లిం మహిళల సాధికారతకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావటం వల్ల పార్టీలో చేరితే ముస్లింలకు మ‌రింత మంచి చేసే అవకాశం ఉన్నందున పార్టీకి ఆకర్షితుడినై భాజ‌పాలో చేరిన‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిజాముద్దీన్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మౌలాలి, సుభాని, భాషా, దస్తగిరి, గౌస్ త‌దిత‌రులు భాజ‌పాలో చేరారు.

Just In...