Published On: Fri, Jul 12th, 2019

భాజ‌పాతోనే మైనార్టీల‌కు ర‌క్ష‌ణ‌

* మైనార్టీ నేత షేక్ ర‌హమ‌తుల్లా

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌:  భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో మైనారిటీలకు రక్షణ ఇస్తుందని బిజెపి మైనార్టీ నేత షేక్ రహమతుల్లా స్పష్టం చేశారు. దేశాన్ని జాతిని ప్రేమించే ప్రతి మైనారిటీ బీజేపీ నే సమర్ధించాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ మత ప్రాతిపదికన దేశాన్ని విడదీసి శక్తుల వల్ల భారతదేశం సమగ్రత దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. మైనారిటీలను ఓటు బ్యాంకుగా పరిగణించే రాజకీయ పార్టీల పట్ల మైనార్టీలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బిజెపి మైనారిటీలను ఓటు బ్యాంకుగా కాకుండా వారిని అన్ని రంగాలలో అన్ని వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలన్న సంక్షేమ కోణంలో చూస్తోందని స్పష్టం చేశారు. బీజేపీపై మతం ముద్రవేసే రాజకీయ శక్తులు తమ స్వార్థం కోసం మత రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఈ దేశంలో అబ్దుల్ కలాం వంటి శాస్త్రజ్ఞుడిని రాష్ట్రపతిగా నియమించి మైనారిటీల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్న ఏకైక పార్టీ బీజేపీ అని రహమతుల్లా గుర్తు చేశారు.

Just In...