Published On: Tue, Jun 18th, 2019

భాజ‌పాలో చేరిన మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌

సెల్ఐటి న్యూస్‌, ఢిల్లీ: భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన అరకు లోక్‌సభ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత భాజపాలో చేరారు. ఈ సంద‌ర్భంగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో అమిత్‌షా వద్దకు వెళ్లిన గీత మంగ‌ళ‌వారం భాజపాలో చేరారు. అమిత్‌షా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో గీత అరకు లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున విజయం సాధించారు. అనంతరం తెదేపాతో సన్నిహితంగా మెలుగుతూ వైకాపాకు దూరమయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ‘జన జాగృతి’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. తాజాగా తన పార్టీని భాజపాలో విలీనం చేశారు.

Just In...