Published On: Sat, Jan 12th, 2019

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాపితం చేసిన‌ ఘనత వివేకనందునిదే

* ఇస్క‌ఫ్ జాతీయ అధ్యక్షుడు కె.సుబ్బరాజు ఉద్భోద

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: మన సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాపితంగా వ్యాప్తి చేసిన ఘనత స్వామి వివేకనందునిదేనని ఇస్క‌ఫ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు అన్నారు. శ‌నివారం భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి, భారత జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా సత్యనారాయణ వత్రం ఫ్రెండ్స్ సర్కిల్ కార్యాలయం వద్ద జరిగిన సభలో ఆయ‌న ఉద్భోదించారు. వి.తాటి శ్రీకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో కె.సుబ్బరాజు మాట్లాడుతూ 125 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన అంతర్జాతీయ సభలో స్వామివివేకానంద చేసిన ప్రసంగం సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిందని, భారతదేశ‌ ప్రతిష్టను పెంచిందన్నారు. ప్రతి జీవిలో భగవంతుణ్ణి చూడటం, ఆపదలో వున్న వార్ని ఆదుకోవటమే నిజమైన భక్తి అని వివేకనంద పేర్కొన్నారనీ సుబ్బరాజు తెలియ‌జేస్తూ యువత యొక్క శక్తియుక్తులి, ప్రతిభను సద్వినియోగం చేసుకోలేని దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగలేవని వివేకనంద ఏనాడో చెప్పివున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇస్క‌ఫ్ నాయకులు డాక్ట‌ర్ తాటి శ్రీకృష్ణ ఆచార్య రాధాకృష్ణ, నీలం దుర్గారావు, పి.వరప్రసాద్, పూజారి దుర్గారావు మాట్లాడుతూ స్వామి వివేకనందుని సూక్తులు భారతీయ తత్వచింతన వెలుగులో ఆధునీకరణకు దారి చూపాయన్నారు. తొలుత స్వామి వివేకనందునికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇస్కఫ్, ప్ర‌జాసంఘాల కార్యకర్తలు ఆకుల దుర్గాప్రసాద్, కొరివి సాంబశివరావు, మాదాసు శ్రీనివాస్, కైలాసం లక్ష్మినారాయణ, మున్వర్, వైవి రెడ్డి పింగళిరాయలు, మురళి, శశి తదితరులు పాల్గొన్నారు.

Just In...