Published On: Thu, Sep 17th, 2020

భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మోదీ కార్యాచరణ

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ప్ర‌పంచ చిత్ర‌ పటంలో భారత్‌ను అగ్రగామిగా నిలపడమే ధ్యేయంగా ప్రధాన‌మంత్రి నరేంద్రమోదీ అవిశ్రాంతంగా పోరాడుతున్నార‌ని భాజపా నాయకులు కొనియాడారు. మోదీ జన్మదినాన్నిపురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకూ భాజ‌పా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవాసప్తాహ్ కార్య‌క్ర‌మంలో భాగంగా గురువారం కృష్ణలంకలోని భాజ‌పా ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆసరాగా ఉండాలన్న సంకల్పంతో బియ్యం నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో భాజ‌పా బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు డిప్రా వెంకట శివన్నారాయణ, వాసా పల్లపురాజు, తోట శివనాగేశ్వరరావు, ప‌లువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Just In...