Published On: Thu, Sep 17th, 2020

భారీగా గుట్కా, ఖైనీ త‌ర‌లిస్తున్న నిందితులు ప‌ట్టివేత‌

* రూ.31,75,200 విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం

* నాలుగు భారీ వాహ‌నాలు సీజ్‌

* 7 సెల్‌ఫోన్లు, రూ.6.30ల‌క్ష‌లు న‌గ‌దు స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్ల‌ను త‌ర‌లిస్తున్న నిందితుల‌ను విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధ‌వారం నిఘా ఉంచి ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారి నుంచి ‌రూ.31,75,200 విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు  నాలుగు భారీ వాహ‌నాలు సీజ్ చేశారు. అదేవిధంగా నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ.6.30ల‌క్ష‌లు న‌గ‌దును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారిని విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు.

Just In...