Published On: Thu, Sep 10th, 2020

భార్య‌పై డంబెల్‌తో దాడి చేసిన భ‌ర్త‌…

* ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని పోలీసులు

కొవ్వూరు క్రైం, సెల్ఐటి న్యూస్‌: తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం జ‌రిగింది. భార్యపై డంబెల్‌తో భ‌ర్త దాడి చేయ‌గా ఆమెకు తీవ్రగాయాల‌య్యాయి. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొవ్వూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీను చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.
కొన్నాళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం భార్యపై హత్యాయత్నం కూడా చేశాడు. కుమార్తెలతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడు. చివరికి ఉన్మాదిలా మారి బుధ‌వారం రాత్రి భార్య తలపై డంబెల్‌తో బలంగా కొట్టగా ఆమె తీవ్రంగా గాయప‌డింది. విషయం తెలుసుకున్న మాధవి బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తన భర్తకు అధికార పార్టీకి చెందిన ఓ నేత అండగా ఉన్నాడని అందుకే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీను పరారీలో ఉన్నాడు.

Just In...