Published On: Tue, Oct 20th, 2020

భ‌క్తుల భ‌ద్ర‌త‌కే అధిక ప్రాధాన్య‌త…

* నేడు సీఎం చేతుల ‌మీదుగా అమ్మవారికి పట్టువస్త్రాలు

* శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లును ఫోన్‌లో స‌మీక్షించిన మంత్రి వెలంపల్లి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సంద‌ర్భంగా అధికారులంద‌రూ సమన్వయంతో  పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం జరిగేలా అన్ని జాగ్రత్తలు చేప‌ట్టాల‌ని మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొ‌న్నారు. ఈ మేర‌కు దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యం నుంచి మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మంత్రి వెలంప‌ల్లి పోన్‌లో దుర్గ‌గుడి ఈవో సురేష్‌బాబు మ‌రియు ఇత‌ర అధికారుల‌తో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లును స‌మీక్షించారు. ద‌స‌రా ప్రారంభ‌మై గ‌త మూడు రోజులుగా చేసిన ఏర్పాట్లు, భ‌క్తుల విష‌యంలో తీసుకున్న జాగ్ర‌త్త‌ల‌ను అడిగి తెలుసుకుని, ప‌లు సూచ‌న‌లు చేశారు… అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల ద‌ర్శ‌నం  విషయంలో రాజీ లేకుండా అన్నీ నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు. కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా, క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించాల‌న్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం జరిగేలా  అన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారులను అదేశించారు. మూలా నక్షత్రం సంద‌ర్భంగా బుధ‌వారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తార‌ని తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఇత‌ర ఉన్న‌తాధికారులు, ఆలయ పాలకమండలి, కార్యనిర్వాహణాధికారి, రెవెన్యూ, పోలీసు, మునిసిపల్ మరియు అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయాల‌న్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ అమ్మ‌వారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. దేవ‌స్థానంకు వ‌చ్చే భ‌క్తుల‌కు ధ‌ర్మ‌ల్ గన్‌తో ప‌రిక్ష‌లు చేయ‌టం, అనుమనితుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు, అవస‌ర‌మైన వారికి వైద్య ప‌రీక్ష‌ల‌తో పాటు మందుల‌ను కూడా  అందించేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను మంత్రి అదేశించారు. భ‌‌క్తులు విధిగా మాస్కులు ధ‌రించి, జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్నారు. అమ్మవారి ద‌ర్శ‌నానికి  వ‌చ్చే భ‌క్త‌లు విధిగా ఆన్‌లైన్‌లో వారి ద‌ర్శ‌నం మ‌రియు సేవ‌ల‌ను నమోదు చేసుకోవాని మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

Just In...