Published On: Sat, May 11th, 2019

భ‌వానీఘాట్‌లో గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహం ల‌భ్యం..

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: కృష్ణా న‌దిలోని భ‌వానీఘాట్‌లో గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహాన్ని భ‌వానీపురం పోలీసులు శుక్ర‌వారం సాయంత్రం గుర్తించారు. నీటిలో కొట్టుకువ‌చ్చిన మ‌హిళ వ‌య‌సు సుమారు 35 నుంచి 40 సంవ‌త్స‌రాలు మ‌ధ్య ఉండ‌వ‌చ్చ‌ని, మ‌హిళ నైట్ డ్రెస్‌లో ఉంద‌ని భ‌వానీపురం పోలీస్‌స్టేష‌న్ సీఐ మోహ‌న్ రెడ్డి తెలిపారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Just In...